భువనగిరి గడ్డపై గర్జించిన కాంగ్రెస్..

– జనసముద్రంలా మారిన  పట్టణ దారులు…
– జై కాంగ్రెస్ నినాదాలతో హోరేత్తిన భువనగిరి ఖిల్లా…
– జన నీరాజనాల మధ్య సాగిన కుంభం నామినేషన్ ర్యాలీ…..
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
 యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ శ్రేణులు మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జన సముద్రం వెళ్లి, జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. నామినేషన్ వేసిన అనంతరం ర్యాలీలో కుంభంకు అడిగాడు నీరాజనం పలికారు. పూలవర్షం, డప్పు వాయిద్యాలు, కళాకారుల ఆటపాటలు, జానపద కళాకారులు నృత్యాలను ఆకట్టుకున్నాయి. పట్టణ దారులు మొత్తం జనసంద్రంగా మారి భువనగిరి గడ్డపై కాంగ్రెస్ పార్టీ గర్జించిందా అన్న చందంగా ర్యాలీ హాట్టహాసంగా కొనసాగింది. అడుగడుగునా   జనం నీరాజనాలు పలుకగా, భువనగిరిలో జై కాంగ్రెస్ నినాదం నలుమూలల మారుమోగింది. భువనగిరి పాత బస్టాండ్ సాయిబాబా మందిరం నుంచి డప్పు చప్పులతో కోలాటాలతో పీర్ల ఊరేగింపుతో మొదలైన ర్యాలీ కనుచూపు మీరంతా మూడు రంగుల కాంగ్రెస్ జెండాతో మన నేస్తం అంటూ ప్రజలు జన ప్రవాహంలా కదిలారు. దారి పొడవున పూల వర్షం కురిపిస్తూ జనాలు తన అభిమానాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగగా, అంబేద్కర్ చౌరస్తా వద్ద అనిల్ కుమార్ రెడ్డి అభిమానులు భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా కుంభం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని, ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీపై విసుగుచేంది మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, రాబోయే 20 రోజుల్లో 40ఏండ్ల చరిత్రను భువనగిరి గడ్డపై ప్రజలు తిరగరాసి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారని దీమా వ్యక్తం చేశారు.
అమ్మ ఆశీర్వాదం గెలిపించేనా…
అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు తన తల్లి కుంభం సుశీల వద్ద ఆశీర్వాదం తీసుకొని, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దర్శనంతో మొదలుకొని , పడమటి సోమవారం  బసవలింగేశ్వర స్వామి ఆలయంలో , భువనగిరి ఎల్లమ్మ దేవాలయంలో, కిసాన్ నగర్ దర్గాలో, గాస్పల్ చర్చి వద్ద  ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి, అభిమానులతో కలిసి భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్  తో కలిసి  తన నామినేషన్ దాఖలు చేశారు.