నవతెలంగాణ-దుబ్బాక రూరల్
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని , ఆ పథకాలే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపిస్తాయని దుబ్బాక మండల ఎన్నికల పరిశీలకులు ఎల్లు రవీందర్ రెడ్డి, దుబ్బాక జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా జడ్పిటిసి సొంత గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో అమలయ్యే సంక్షేమ పథకాలను, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పుడో ఖాయమైందనీ, కాంగ్రెస్ బిజెపి నాయకుల మాయమాటలు నమ్మి ఓటేసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కొత్త కిషన్ రెడ్డి, కెఆర్ భీమసేన, నారా గౌడ్, దేవరాజ్, మూర్తి కరుణాకర్ రెడ్డి తదితరులున్నారు