మద్దతు ధర రూ.3 వేలు ఇవ్వాలి

– నకిరేకల్‌ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు
నవతెలంగాణ-కేతేపల్లి
రైతుకు మద్దతు ధర రూ.3,000 ఇవ్వాలని నకిరేకల్‌ నియోజకవర్గ సీపీిఐ(ఎం) అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ఉప్పలపాడు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యాన్ని పోస్తే అకాల వర్షంతో ధన్యమంతా తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు చేసింది ఏమీ లేదని, గిట్టుబాటు ధర అందించడంలో పూర్తిగా విఫలం చెందారని రానున్న ఎన్నికలలో ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పై రైతాంగం ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేతపల్లి సిపిఐ (ఎం) పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ్య, సోమయ్య, రామలింగం, సైదులు, లింగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.