రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి

– జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్‌
మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం మున్సిపల్‌ కేంద్రంలోని రాజీవ్‌ స్మారక భవనంలో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో గడపగడపకు వెళ్లి కాంగ్రెస్‌పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌తోనే అభివద్ధి సాధ్యమవుతుందన్నారు. చేయి గుర్తుకు ఓట్లు వేసి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని యువతకు సూచించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మున్సిపల్‌, మండల అధ్యక్షులు సుర్వి నర్సింహాగౌడ్‌, బోయ దేవేందర్‌, మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు మాదగోని శేఖర్‌గౌడ్‌, ఊదరి శ్రీనివాస్‌, రాచకొండ భార్గవ్‌, భీమనపల్లి శివ పాల్గొన్నారు.