– మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి
– కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
కాంగ్రెస్ హయాంలో 40ఏండ్లుగా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశానని బిఆర్‌ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ అని అలాంటి పార్టీని ఎవరు నమ్మవద్దని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. బుధవారం నందికొండ మున్సిపాలిటీకి చెందిన బిఅరెస్ 9వ వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకష్ణ,6వ వార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డి సమక్షంలో వందల సంఖ్యలో భారీ ఎత్తున తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.అంతకుముందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ 8 పర్యాయాలు తనని ఆదరించి అభిమానించిన ప్రజలకు అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. అదేవిధంగా రుణ భారాన్ని తగ్గించడానికి పేద సన్నకారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి,తుమ్మల పల్లి శేఖర్ రెడ్డి,శంకర్ నాయక్,వైన్స్ ప్రసాద్,బత్తుల వెంకటేశ్వర్లు,ఓర్సు నరసింహారావు, ఉంగరాల శ్రీను, రంగా రెడ్డి,మీ సేవ సుమన్, నాగరాజు, రామకష్ణ రెడ్డి, వేణు, శంకర్, రాంబాబు నియోజకవర్గ ముఖ్యనాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.