బూత్‌కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా పనిచేయాలి

– ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే భగత్‌
నవతెలంగాణ -పెద్దవూర
బూత్‌ కమిటీ సభ్యులందరు కలిసి కట్టుగా పని చేయాలని ఉమ్మడి జిల్లా ఎంఎల్‌సీ సాగర్‌ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జి ఎంసీ కోటిరెడ్డి, రామచంద్ర నాయక్‌లు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని మల్లిఖార్జున ఫంక్షన్‌ హాల్లో సాగర్‌ నియోజకవర్గ బూత్‌ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బూత్‌ కమిటీ సభ్యుల పాత్ర కీలకమని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ మాట్లాడుతూ తనను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ నెల 14న హాలియా పట్టణంలో జరుగనున్న సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మండల కేంద్రం లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు. రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్‌, ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్‌ రెడ్డి, జడ్పీటీసీ అబ్బీడి కష్ణా రెడ్డి, పాక్స్‌ చైర్మన్‌ గుంటుక వెంకట్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జాటావత్‌ రవి నాయక్‌, స్థానిక సర్పంచ్‌ నడ్డి లింగయ్య, మాజీ ఎంపీపీ కూరాకుల అంతయ్య, మండల రైతు సామన్వయ సమితి అధ్యక్షులు గజ్జేల లింగారెడ్డి, మిట్టపల్లి శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మ రెడ్డి, కార్మిక సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ బషీర్‌, సుంకిరెడ్డి వెంకట్‌ రెడ్డి, బొడ్డుపల్లి చంద్రశేఖర్‌, ముని రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.