అరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి

అరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి– ప్రధాని మోడీకి వినతి
హైదరాబాద్‌. ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని ప్రధాని మోడీని ఆ సంఘం అధ్యక్షుడు చెట్టిపల్లి శివాజీ ప్రధాని మోడీని కోరారు. మోదీ గర్జనకు నగరానికి విచ్చేసిన సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రధానిని కలిసి వివరించినట్టు చెట్టిపల్లి శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కులం రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్నప్పటికి కేంద్రంలో ఓబీసీ జాబితాలో లేకపోవడంతో అన్యాయానికి గురవుతున్నాం అని ప్రధానికి తెలిపారు. దీనిపై ప్రధాని స్పందించి త్వరలోనే మీ సమస్య పరిష్కారమవుతుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు.