నవతెలంగాణ- బీబీనగర్
జిల్లాలో రైస్ మిల్లర్ల దోపిడీ అధికంగా ఉందని కావున వాటిని వెంటనే అరికట్టాలని సీపీఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు బుద్ధ వెంకటేష్, బీబీనగర్ మండల కార్యదర్శి శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని గూడూరు గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించి మాట్లాడుతూ ధాన్యం రంగు మారిందని విజయం శాతం తక్కువ ఉందని, నేచర్ రాలేదని కుంటి సాకులతో తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారన్నారు. రెండు నుండి మూడు కిలోలు బస్తాకు తగ్గించి తీసుకుంటున్నారని ఆవేదన చెందారు, కానీ ప్రభుత్వ మాత్రం ప్రతి ఒరిగిందనుకుంటామని ప్రకటించి నా మిల్లర్లు మాత్రం ప్రభుత్వం మాట వినడం లేదన్నారు. జిల్లాలో అనేక మార్కెట్లో కొరిధాన్యం తూకాలు వేసి లారీలు రాక మార్కెట్లో నిల్వ ఉన్నాయని అకాల వర్షాలు పడితే అది నష్టాన్ని రైతులే భరించాలి తప్ప ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోదని వారు విమర్శించారు, గూడూరు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పది రోజుల నుండి లారీలు రావడంలేదని ఇప్పటివరకు 1300 బస్తాలు కాంటా వేసి సిద్ధంగా ఉన్నాయని అన్నారు, సంబంధిత అధికారులు లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సిపిఎం మండల నాయకులు సత్యనారాయణ, కిరణ్, రైతులు వనం సత్యనారాయణ రెడ్డి, నరూరి రాజు, నోముల బాల్ రెడ్డి, కుశంగులకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.