కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ కు ఘన స్వాగతం..

 – మునుగోడు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి
నవతెలంగాణ చౌటుప్పల్
: చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో మునుగోడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ కు గురువారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గాలి వీస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేస్తారని ఆయన తెలిపారు. మునుగోడు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చలమల్ల కృష్ణారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని తెలిపారు. అనంతరం దామెర క్యాంప్ ఆఫీస్ నుండి భారీ కార్ల ర్యాలీతో చండూరు నామినేషన్ కేంద్రానికి ఊరేగింపుగా వెళ్లారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షంగౌడ్, దోనూరి వీరారెడ్డి, బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఉడుగు వెంకటేష్ గౌడ్,సర్పంచులు కాయతి రమేష్ గౌడ్, బాతరాజు సత్యం, ఎంపీటీసీ మునగాల తిరుపతిరెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పర్నే శివారెడ్డి శివారెడ్డి, శాగ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.