-2018 లో వెయ్యి నోట్లు… ఇప్పుడు 2 వేల నోట్లు
నవ తెలంగాణ- సిరిసిల్ల: రాజకీయ పార్టీల ఎన్నికలను డబ్బులతో ముడిపడే విధంగా మార్చేశాయి ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు తమకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసే స్థాయికి రాజకీయాలను దిగజార్చారు ఎన్నికంటేనే డబ్బుతో కూడుకున్న విషయంగా మారింది నాయకులు ఎవరిని ప్రసన్నం చేసుకోవాలన్నా జేబులో చేయి పెట్టి ఎంతో కొంత ముట్టచెప్పాల్సిన పరిస్థితులు ఎన్నికల్లో నెలకొన్నాయి. అయితే గతంలో ఉన్న పెద్ద నోట్లు ప్రస్తుతం కనిపించకపోవడంతో ఆశించిన వారికి చిన్నవే దక్కుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో పెద్ద నోటు 1000 కనిపించింది అదే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నోటు రద్దు కాగా 2000 నోటు వచ్చింది అప్పటి ఎన్నికల్లో నాయకులు తమ జేబుల్లో చేయి పెడితే 2000 నోటు బయటకు రావడంతో ఆశించిన వారు పండగ చేసుకునేవారు. పెద్ద నోట్లతో నేతలకు సైతం భారంగా మారింది అయితే ఇటీవల 2000 నోటు రద్దు కావడంతో ఈ ఎన్నికల్లో ఆ నోటు కనిపించడం లేదు ఎక్కడ చూసినా 500 నోట్లే కనిపిస్తున్నాయి తనిఖీల్లో దొరికిన నోట్ల కట్టాల్లో అత్యధికంగా 500 నోట్ల కట్టాలే కనిపిస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు కావడంతో అన్నీ చిన్న నోట్లే కనిపించడంతో కొంతవరకు ఆర్థిక భారం తగ్గిందని నాయకులు భావిస్తున్నారు చోటామోటా కార్యకర్తలు మాత్రం పెద్ద నోట్లు కనిపించకపోవడంతో దిగాలుగా ఉన్నారు.