రేవంత్ రెడ్డి సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు

నవతెలంగాణ- పెద్దవంగర: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభకు, కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఝాన్సీ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. సభకు వెళ్లే వాహనాలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై బీఆర్ఎస్ తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి హనుమండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రంగు మురళి, బీసు హరికృష్ణ, పూర్ణచందర్, శ్రీరాం జగదీష్, జగ్గా నాయక్, పొడిశెట్టి సైదులు, గద్దల ఉప్పలయ్య, చిలుక దేవేంద్ర, చిలుక సంపత్, ధర్మారపు వెంకన్న, సుంకరి అంజయ్య, సుంకరి రమేష్, చెరుకు యాకయ్య తదితరులు తరలి వెళ్లారు.