
అనంతరం మరియానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఓ.పి.ఓ లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల విధులు బాధ్యత గా నిర్వహించాలని, ఓ.పి. ఓ లకు విధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. శిక్షణా కార్యక్రమం లో శిక్షణ పొందుతున్న ఓ.పి.ఓ లను వారి విధులపై ప్రశ్నలు అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. పోలింగ్ రోజున మొదటి పోలింగ్ అధికారి ఓటర్ పోలింగ్ కేంద్రం కు ఓటు వేసేందుకు వచ్చిన తర్వాత ఓటర్ ను గుర్తింపు కు ఎపిక్ కార్డ్, ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డ్ లు చెక్ చేసి ఓటర్ జాబితా లో మార్క్ చేయాలని అన్నారు.