పద్మావతి ఫిల్లింగ్‌స్టేషన్‌లో ఘరానా మోసం

– డీలర్‌ షిప్‌ను రద్దు చేయాలని వినియోగదారుల డిమాండ్‌
నవతెలంగాణ-పర్వతగిరి
వాహనదారులను తప్పుడు కొలతలతో దగా చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న పర్వతగిరి మండల కేంద్రంలోని పద్మావతి ఫిల్లింగ్‌ స్టేషన్‌పై తూనికలు, కొలతల అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుని సీజ్‌ చేసి డీలర్‌షిప్‌ రద్దు చేయాలని వినియోగదారులు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. బాధితులు బొబ్బాల ప్రతాప్‌రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆయన కథనం మేరకు వివ రాలిలా ఉన్నాయి. తనవ్యవసాయ ట్రాక్టర్‌లో డీజిల్‌నిమిత్తం రాత్రి 7.30 గంటల కు పెట్రోల్‌పంపుకు వెళ్లి రూ.1850ల డీజిల్‌ కావాలని సిబ్బందిని కోరడంతో మె షిన్‌లో అంతే మొత్తానికి ఫీడ్‌ చేసి డీజిల్‌ క్యాన్‌లో పోయగా ఆరు లీటర్ల మేరకు తగ్గినట్లు గుర్తించిన తాను మరో వినియోగదారుడికి పోసిన డీజిల్‌ను పరిశీలించి డీజీల్‌ తక్కువగా వచ్చిందని ప్రభుత్వ నిర్ణీత కొలతల జార్‌తో కొలచి పోయాలని ఈవిషయంపై సిబ్బందిని ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానాలు చెబుతూ యజమానికి సమాచారం అందించారన్నారు. దీంతో నాకు జరిగిన మోసాన్ని ప లువురు పాత్రికేయులకుసమాచారం అం దించడంతో పెట్రోల్‌పంపు యజమాని వచ్చి తనపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ విలేక రిపై దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఫొటో లు, వీడియోలు తీయకుండా అడ్డుకున్నా రన్నారు. ఈ క్రమంలో మరికొంత మంది వాహనదారులు అక్కడకు చేరుకోగానే త మదే పొరపాటు అని డీజిల్‌ను 5లీటర్లు, 1 లీటర్‌ కొలతలు వేయగా 6 లీటర్లు త క్కువ డీజిల్‌ వచ్చినట్లు చెప్పారు. రైతు లు, వాహనదారులను అడ్డగోలుగా మో సం చేస్తున్న పద్మావతి ఫిల్లింగ్‌స్టేషన్‌ య జమానిపై చర్యలు తీసుకుని డీలర్‌షిప్‌ రద్దు చేయాలని అధికారులను కోరారు.