ముగిసిన నామినేషన్ లు పర్వం..

– 23 మంది అభ్యర్ధులు,35 నామినేషన్ లు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాదారణ ఎన్నికల నామినేషన్ లు స్వీకరణ పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు 14 మంది అభ్యర్ధులు 17 నామినేషన్ లు  దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు తెలిపారు. మొత్తం 23 మంది అభ్యర్ధులు 35 నామినేషన్ సెట్ దాఖలు అయ్యాయని అన్నారు. నామినేషన్ వేసిన వారిలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు(బీఆర్ఎస్), జారే ఆది నారాయణ(కాంగ్రెస్), పిట్టల అర్జున్(సిపిఐ ఎం),సున్నం నాగమణి (కాంగ్రెస్ రెబల్), ముయ్యబోయిన ఉమాదేవి(జనసేన), మనుగొండ వెంకట ముత్యం(బిసివైపి) ముఖ్యులు గా ఉన్నారు.

1)మెచ్చా నాగేశ్వరరావు(బీఆర్ఎస్)
2)జారే ఆదినారాయణ (కాంగ్రెస్)
3)పిట్టల అర్జునరావు (సిపిఎం)
4)గొగ్గల ఆదినారాయణ (సిపిఎం)
5)మడకం ప్రసాద్ (బిఎస్పీ)
6)వాసం పోలయ్య (ఆబాద్ పార్టీ)
7)పద్దం వెంకటరమణ (ఎలైన్స్ ఆప్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ)
8)ఒకే రవి (గోండ్వానా దండకారణ్య పార్టీ)
9)మూడ్ రవీందర్ (ఇండిన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ)
10)మనుగొండ వెంకట ముత్యం (భారత చైతన్య యువజన పార్టీ)
11)కన్నెబోయిన వెంకట నర్సయ్య (గోండ్వానా గణతంత్ర పార్టీ)
12)తాటి నవీన్ (యుగ తులసి పార్టీ)
13)ముయ్యబోయిన ఉమాదేవి (జనసేన)
14)ముయ్యబోయిన కిరణ్ (జనసేన)
15) ధరావత్ హనుమంతరావు (బహుజన ముక్తి పార్టీ)
16) కల్లూరి కిషోర్ (స్వతంత్ర)
17) ఆంగోతు కృష్ణ (స్వతంత్ర)
18) కుంజా నాగమణి (స్వతంత్ర)
19) కంగాల కల్లయ్య (స్వతంత్ర)
20) అరియం ప్రశాంత్ (స్వతంత్ర)
21) సున్నం నాగమణి (స్వతంత్ర)
22) తంబాల రవి (స్వతంత్ర)
23) ఊకే ముక్తేశ్వరరావు (స్వతంత్ర)