అక్కడ చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతదా

– ప్రతిపక్షాల కల్లిబెల్లి మాటలను నమ్మొద్దు…
 -ఎమ్మెల్యే సతీష్ కుమార్ 
నవతెలంగాణ- హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి గురించి కొంతమంది ప్రతిపక్ష నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కరీంనగర్ ఎంపీగా కరీంనగర్ కు హుస్నాబాద్ ప్రాంతానికి ఆయన చేసింది ఏమి లేదన్నారు.కరీంనగర్ లో మూడుసార్లు ప్రజలు తిరస్కరిస్తే ఇక్కడికి వచ్చి హుస్నాబాద్ అభివృద్ధి చెందలేదని, నేను అభివృద్ధి చేస్తాను అని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నా మాజీ ఎంపీ మాటలు ప్రజలు నమ్మరని, కల్లబొల్లి మాటలను ప్రజలు పట్టించుకోరని ప్రజలకు వాస్తవాలు తెలుసునని చెప్పారు. ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. హుస్నాబాద్ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచారని, తెలివైనవారు బూటకపు మాటలు మాట్లాడే నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని సతీష్ కుమార్ అన్నారు. ప్రతిపక్ష నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసిన నాయకులు ఆదరించాలని కోరారు.