టిటీడీ ఎల్‌ఏసీ సభ్యునిగా అజయ్

నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్‌
తెలంగాణలో తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా దేవులపల్లి అజయ్ ని నియమిస్తూ కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేసారు. జూబ్లిహిల్స్‌, హిమాయత్‌ నగర్‌, నిర్మాణంలో ఉన్న కరీంనగర్‌ టీటీడీ అభివద్ధి కార్యక్రమాల్లో సేవా భావంతో పని చేయాలని లేఖలో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ముఖ్య సలహా దారు సజ్జల రామకష్ణ రెడ్డి, టీటీడీ ఛైర్మెన్‌ కరుణాకర్‌ రెడ్డి, ఈఓ ధర్మా రెడ్డి జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌లకు అజరు కతజ్ఞతలు తెలిపారు.