వేముల వీరేశం ను గెలిపించండి

నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేముల వీరేశమును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు పన్నాల గోపాల్ రెడ్డి కోరారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో కరపత్రం ఆవిష్కరించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో వేముల వీరేశం చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని దుయ్యబెట్టారు. రాష్ట్ర సహజ వనరులను కొల్లగొడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన సాగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ అనుకూల విధానాలతో, ఫాసిస్టు స్వభావంతో విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీ విస్తరణను రాష్ట్రంలో అడ్డుకోవాలన్నారు. ఈ సమావేశంలో కమిటీ ప్రతినిధులు మంద రంజితరావు, నిమ్మల రాఘవులు, కె ప్రజ్యుమ్న రెడ్డి , దాడి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.