బీఆర్ఎస్ కు అధికారమిస్తే అందరూ గోసపడుతారు 

– రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరీ మురళీ విజ్ఞప్తి 

– ఓట్ల ఉద్యమంతోనే అసలైన సామాజిక సమానత్వమని సూచన 
– రాజకీయ అధికారమే కేసీఆర్ లక్యమని అగ్రహం 
– రాష్ట్రంలో అసమర్థ, అహంకార పాలన జరిగిందని వెల్లడి 
నవతెలంగాణ-బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర సాధన అకాంక్షలను తుంగలో తొక్కి కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల అత్మగౌరవాన్ని అణచివేతకు గురిచేసి పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మళ్లీ అధికారమిస్తే అందరూ గోసపడుతారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరీ మురళీ విజ్ఞప్తి చేశారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ  కార్యలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేధిక(టీఎస్ డీఎఫ్)అధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిపాలనలో ఓటరు చైతన్య బస్సు యాత్రలో ఓటు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆకునూరి మురళీ మాట్లాడారు.దేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేక విద్య వ్యవస్థ అద్వానంగా మారిందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన వల్ల విద్య వైద్యం,ఉపాధి కరువై నిరుద్యోగం పెరిగిపోయిందని అగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి వల్ల నేటికి సుమారు పది లక్షల రైతులు భూ సమస్యలతో సతమతమవుతున్నరన్నారు. ధరణితో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైయ్యాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అకాంక్షలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉందని..ఓట్ల ఉద్యమంతోనే రాష్ట్రంలోని ప్రజలందరికి అసలైన సామాజిక సమానత్వం లబిస్తుందని సూచించారు.పదేండ్లు పరిపాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారమే లక్ష్యంగా పని చేసిందని.. కేసీఆర్ కు రాజకీయ అధికారమే లక్ష్యమని అగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో అసమర్థ అహంకార ప్రభుత్వానిదే పరిపాలన జరిగిందని ఇప్పటికైన ప్రజలు చైతన్యవంతులై తమ ఓటు విలువేంటో తెలియజేయాలని తెలిపారు.ప్రభుత్వాలు మారిన సంక్షేమ పథకాలు మారవని.. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఉద్యమంల పనిచేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక కన్వీనర్ ప్రో” వినాయక్ రెడ్డి(కాకతీయ రిటైర్డ్), సమన్వయకర్త నైనాల గోవర్ధన్, ప్రొ. పద్మజా షా రిటైర్డ్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం), ప్రొ.లక్ష్మీనారాయణ ( సెంట్రల్ యూనివర్సిటీ), శంకర్(దళిత బహుజన ఫ్రంట్ కన్వీనర్), మహేష్ (పీడీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు) ప్రో. రమ (ఎన్ఐటి), జనార్దన్ (తె. రా .ప్రజాస్వామ్య వేదిక నాయకులు), బామండ్ల రవి కుమార్ ( రైతు కూలి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు), అంజయ్య (తెలంగాణ ప్రజాస్వామిక వేదిక), మార్వాడి సుదర్శన్, కృష్ణ రావు, సత్తార్ ఖాన్, శ్రీకాంత్, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.