దాల్‌ సరస్సులో అగ్ని ప్రమాదం

దాల్‌ సరస్సులో అగ్ని ప్రమాదం– ముగ్గురు పర్యాటకుల సజీవ దహనం
– ఐదు హౌస్‌ బోట్ల దగ్ధం
శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత దాల్‌ సరస్సు వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఐదు హౌస్‌బోట్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిన కొన్ని గంటల తరువాత దగ్ధమైన సఫీనా అనే హౌస్‌బోట్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలను గుర్తించారు. దాల్‌ సరస్సులోని ఘాట్‌ నంబర్‌9 సమీపంలోని ఒక హౌస్‌బోట్‌లో ముందుగా మంటలు చెలరేగాయని, చాలా వేగంగా ఇతర బోట్లను చుట్టుముట్టిందని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.