మతోన్మాద.. అవకాశవాద పార్టీలను ఓడించండి

– సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి
– పైల ఆశయ
– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు.
నవతెలంగాణ – భువనగిరి: అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) భువనగిరి అభ్యర్థి కొండమడుగు నరసింహులు అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరుతూ మతోన్మాద అవకాశవాద పార్టీలను ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైల ఆశ పిలుపునిచ్చారు.  ఆదివారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సమావేశం పట్టణ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పైలా ఆశే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మతోన్మాద అవకాశవాద పార్టీల ఓడించాలన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు మరింత తీవ్రమైనవని రైతు వ్యతిరేక చట్టాలు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసిందన్నారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ధరలు ఆకాశాలుంటాయి అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని స్థాయికి మోడీ పాలలో నిరుద్యోగం మహిళల మీద దాడులు కుల దురంకార దాడులు పెరిగాయి అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే బతుకులు మారుతాయని ఆశించిన పేద ప్రజలకు డిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దళిత ముఖ్యమంత్రి మూడు ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వాటి పథకాల ఆశ చూపి పేద ప్రజలను ముంచాయని గజమెత్తారు. రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పరికరాలలో ను విత్తనాలను అందించకుండా రైతుబంధు పథకం అడ్డం పెట్టుకొని రైతులను మోసం చేస్తుందని ఆరోపణ చేశారు. స్వార్థ ప్రయోజనాల తప్ప రాష్ట్ర సమగ్ర అభివృద్ధి బూజువ పార్టీలకు పట్టదని హైదరాబాదులో చూపించి అదే అభివృద్ధి గాను తెలంగాణ అభివృద్ధి గాను రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది పైగా గొప్పతనం తమదంటే తమదని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి లు పోటీ పడుతున్నాయి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రజాస్వామ్య హక్కులు లౌకిక విలువలు రాజ్యాంగ పునాదుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం పోరాడడానికి శాసనసభలో కమ్యూనిస్టులు అవసరమని అందుకే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి సిపిఎం అభ్యర్థిని కొండమడుగు నరసింహను గెలిపించాలని కోరారు. రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ భువనగిరి పట్టణ కేంద్రంలో 1950 మంది అర్హులకు గాను 565 ఇండ్లు మాత్రమే అసంపూర్తిగా నిర్మించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.   ప్రభుత్వ, డిగ్రీ, పీజీ, టెక్నికల్ కాలేజీలు లేక పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు అన్నారు. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడంతో ప్రజలకు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఉన్నారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న విద్యార్థులకు ప్రభుత్వ విద్య పూర్తి అందాలన్నా పేదలకు ఇండ్లు ఇల్లు స్థలాలు దక్కాలన్న కమ్యూనిస్టు అభ్యర్థులు చట్టసభల్లో ఉండాలన్నారు. కమ్యూనిస్టు అభ్యర్థులు చట్టసభల్లో ఉండడం మూలంగా కార్మికుల రైతుల ఉద్యోగ, ఉపాద్యాయుల, మహిళల, బడుగు బలహీన వర్గాల సమస్యలపై గళం ఎత్తడానికి అవకాశం ఉంటుందన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం పోరాడడానికి శాసనసభల్లో కమ్యూనిస్టుల అవసరము ఎంతైనా ఉందన్నారు.  భువనగిరి నియోజవర్గ సిపిఎం అభ్యర్థి కొండమడుగు నరసింహ  సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు బర్ల వెంకట అధ్యక్షతన జరగగా టౌన్ కార్యదర్శి మాయ కృష్ణ, టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య, బొమ్మాయిపల్లి శాఖ కార్యదర్శి బండి రవి, టౌన్ సభ్యులు ఎండి సలీం  పాల్గొన్నారు.