అందరికీ అండగా ఉంటా..

 – ఎవరికి భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి
 – కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ బాబు
నవతెలంగాణ-వీణవంక: అందరికీ అండగా ఉంటానని, ఎవరికీ భయపడొద్దని.. అందరూ ధైర్యంగా ఉండండని హుజురాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి  వొడితెల ప్రణవ్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, కిష్టంపేట, మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి, గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లోని మహిళలు, యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళలు సంతోషపడేలా ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆరు గ్యారంటీలను తయారు  చేశారని అన్నారు. వారి ఆశిస్సులతో రాష్ర్ట ప్రభుత్వం ఏర్పడగనే వాటిని ప్రతీ గడపకు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతీ మండలంలో యువత ఉద్యోగాల కోసం డిజిటల్ లైబ్రరీలను సొంత డబ్బులతో ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, ఈ ఎన్నికలల్లో వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ హామాలను అర్హులందరికీ అందేలా చూస్తానని, నవంబర్ 30న జరగే ఎన్నికలల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల ప్రణవ్ బాబు ఓటర్లను కోరారు.