బిసి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం

నవతెలంగాణ- మల్హర్ రావు: మండలంలో ఉన్న బీసీ కుల సంఘాలు ఒకటిగా కలిసి ఉండి మన ఓటు మన సీటు రాజ్యాధికారం రావాలంటే మంథని నియోజక వర్గంలో బిసి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ ను గెలిపించాలని బిసి సంఘాల నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంగళవారం మండలంలోని రుద్రారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ప్రాంతం పరిపాలించారు. బీసీ కులస్తులకు అభివృద్ధి జరగాలంటే రాజకీయాల్లో అధికారం రావాలంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిస్తే హైదరాబాద్లో ఉండే నాయకుడు కావాలా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే నిత్యం అందుబాటులో ఉండే ప్రజలే నా కుటుంబ సభ్యులను అనుకునే మన ప్రియతమ నాయకుడు బీసీల ఆశాజ్యోతి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్  మీ అమూల్యమైన కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి అనిపెద్ధి రాంబాబు,వడ్డెర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా కుమార్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుసాలబి రవి,విశ్వ బ్రహ్మిన సంఘం జిల్లా నాయకులు ఓదెల బ్రహ్మ చారి,కేశవ చారి పాల్గొన్నారు.