నరేంద్ర మోడీకి పేదల మీద ప్రేమ లేదు: ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్

నవతెలంగాణ- రామారెడ్డి: నరేంద్ర మోడీకి పేదల మీద ప్రేమ లేదని, సిలిండర్ను రూ 400 నుండి రూ 1100 చేసిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంద మంగళవారం ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని మద్దికుంటలో వెలసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మద్దికుంట ఆలయ కమిటీ చైర్మన్ గోజరి లచ్చిరెడ్డి, ఆలయ అభివృద్ధి కోసం గంప గోవర్ధన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మద్దికుంట తో పాటు రెడ్డి పెట్, జగదాంబ తండా, స్కూల్ తాండ, బట్టు తాండ, అన్నారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు గంటల కరెంటు ఇచ్చే పార్టీ కావాలా? 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు అందించే బీఆర్‌ఎస్‌ పార్టీ కావాలా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫార్మర్లు పేలాయని, రాత్రుల్లో రైతులు పాముకాటుకు గురై చనిపోయారని అన్నారు. గుజరాత్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ప్రధానమంత్రిగా చేస్తున్న నరేంద్ర మోడీ ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉగాది నుండి కొత్త పింఛన్లను దశలవారీగా రూ 5000 అందిస్తామని మాట్లాడారు. రూ 400 కే గ్యాస్ సిలిండర్ను అందజేస్తామని, అసైన్డ్ భూముల రైతులు అమ్ముకునేందుకు హక్కుపత్రాలు అందిస్తామని, పోడు భూములకు పట్టాలు అందిస్తామని అన్నారు. తండాల అభివృద్ధికి గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందన్నారు. 93 లక్షల మంది రైతులకు రైతు బీమా అందజేసి కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చామనరు. మద్దికుంట ఆలయ అభివృద్ధికి రూ 15 లక్షలు అందజేశామని, మొదటి విడతలో రెండు కోట్లు అందిస్తామని, చెరువును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని, అడవిని టూరిజం గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్ ఫైడ్ చైర్మన్ గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, స్థానిక ఎంపీపీ దశరథ్ రెడ్డి, మాచారెడ్డి ఎంపీపీ నరసింగరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రామ్ రెడ్డి, ఎంపీటీసీల పూర్ణ అధ్యక్షులు రాజా గౌడ్, మామిళ్ళ అంజయ్య, మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధు తదితరులు పాల్గొన్నారు.