కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉంటే ఉద్యోగాలు రావు: రేవంత్ రెడ్డి

– భూములు గుంజుకునేందుకే, కెసిఆర్ కామారెడ్డి వస్తున్నారు.
–  కట్టెల పొయ్యి పోవాలంటే, కాంగ్రెస్ పార్టీ రావాలి.
 నవ తెలంగాణ- రామారెడ్డి
కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నన్ని రోజులు, రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు రావని టి పి సి సి రేవంత్ రెడ్డి మంగళవారం అన్నారు. మండలంలోని రెడ్డి పేటలో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ… మండలంలోని మద్దికుంటలో వెలిసిన శ్రీ స్వయం భూ  బుగ్గ రామలింగేశ్వర స్వామి మందిరాన్ని గతంలో షబ్బీర్ అలీ అభివృద్ధి చేసినట్లు, అభివృద్ధి చేస్తామని అన్నారు. నిరుద్యోగుల గోసతో, నిరుద్యోగులు నిరుద్యోగ బ్యానర్ పట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తలేవని, తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డ యువత, తల్లిదండ్రులు ఉపాసం పండుకొని రెక్కల కష్టంతో చదివించిన, 22 సంవత్సరాలు ఉన్న పిల్లగాడు 10 సంవత్సరంలో పట్నంలో చదివిస్తే ఉద్యోగం రాక, ఊర్లో ముఖం చూపించక, పరీక్ష పత్రాలు లీకై అమ్ముకుంటే, పిల్లలు ఉరివేసుకొని చస్తున్నారని అన్నారు. రామారెడ్డికి చెందిన లింబయ్య పంట నష్టపోయి, పట్నంలో బతకలేక, ట్యాంక్ బండి పై ఉరి వేసుకున్నాడని, ధాన్యం కుప్ప పై చలికి వానకి గుండా ఆగిపోయి బీరయ్య అనే రైతు చనిపోయాడని, ఇలాంటి కుటుంబాలను సీఎం గాని, ఎమ్మెల్యేలు గాని పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు. మాస్టర్ ప్లాన్ తో భూములు గుంజుకునేందుకు కెసిఆర్ కామారెడ్డి వస్తున్నాడని అన్నారు. అడవిలో పులి ఊర్లలో మనుషులను, పెంపుడు జంతువులను తినడానికి వస్తే, వేటగాడి కోసం ప్రక్క ఊరి నుండి నన్ను అధిష్టానం పంపిందని, కెసిఆర్ ను వెంటాడి, కామారెడ్డి ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లకు రూ 5 లక్షలు, పింఛన్ రూ 4000, సిలిండర్ రూ 500, ఇంటి కరెంట్ బిల్ 200 యూనిట్ల వరకు ఉచితమని, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతు భరోసా కింద రూ 15000, అందిస్తామని అన్నారు. మండలంలోని బట్టు తాండ సర్పంచ్ రెడ్డి నాయక్ బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షబ్బీర్ అలీ, అరికెల నర్సారెడ్డి, అద్దంకి దయాకర్, యూసుఫ్ అలీ, జిల్లా పరిషత్ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.