నవతెలంగాణ -మద్దిరాల: మద్దిరాలను నూతన మండలంగా ఏర్పాటుచేసి అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని నాకు అండగా ఉండి ఆశీర్వదించండి అని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని చిన్ననెమిల, గుట్ట కాడి తండా, మామిళ్ళమడవ, తూర్పుతండ పీరియతండా, జి కొత్తపల్లి, ముకుందా పురం మద్దిరాల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన మండలం తోపాటు గిరిజన ప్రాంతాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కెసిఆర్ దేనని నియోజకవర్గంలో సాగు నీరు తో పాటు త్రాగునీరు ఆసరా పెన్షన్ కల్యాణ లక్ష్మి కెసిఆర్ కిట్లు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఘనత సీఎం కేసీఆర్ నే అని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్ ఏ రజాక్, జడ్పిటిసి కన్నా సురంభ, వీరన్న గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీరామ్ రెడ్డి, నాయకులు మల్లు కపోతంరెడ్డి, సర్పంచులు గౌతమి రాజు, కోమలి, భూక్య లక్ష్మీ వీరన్న, అక్కిరెడ్డి జ్యోతి ఉపేందర్ రెడ్డి, ఎస్ ఏ ఇంతియాజ్ కాతున్ రజాక్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.