నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్ : విపుల్ కుమార్, ఐపీఎస్, పోలీస్ అబ్జర్వర్ మంగళవారం, యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామం, గౌరాయపల్లి ల లో గల పోలింగ్ స్టేషన్ను విజిట్ చేసి గ్రామంలోని పరిస్థితులను తెలుసుకున్నారు. తర్వాత రాజాపేట మండలంలోని రఘునాథపురం ,రాజాపేట, కాశగూడ,చల్లూరు గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ విజిటింగ్ లో శివరాం రెడ్డి ఏసిపి యాదాద్రి, సురేందర్ రెడ్డి యాదగిరిగుట్ట రూరల్ సిఐ, రమేష్ యాదగిరిగుట్ట టౌన్ సిఐ, స్థానిక ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.