నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో జాలర్ల వలకు కొండచిలువ చిక్కుకుంది. మంగళవారం ఉదయం గ్రామంలోని పాత చెరువులో మత్స్యకారులు చేపల కోసం కాండ్రిలు వేయగా అందులో సుమారు 40కిలోల కొండ చిలువ చిక్కుకుంది. మధ్యాహ్నం సమయంలో వలలో చిక్కుకున్న చేపలను తీసేందుకు జాలర్లు కండ్రిలను బయటకు తీయగా అందులో కొండచిలువ ఉన్నట్లు జాలర్లు తెలిపారు. కాగా వేటకు వెళ్లే బోయులు జాగ్రత్తగా వుండాలని ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ జాలర్లను కోరారు.