సిద్దిపేట ప్రాంతం బిఆర్ఎస్ నాయకులకు రాసిచ్చారా

– కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
నవ తెలంగాణ – సిద్దిపేట : సిద్దిపేట పట్టణాన్ని బిఆర్ఎస్ నాయకులకు రాసి ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కబ్జాలకు పాల్పడడం ఇది మంచి పద్ధతేనా అని  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ మండిపడ్డారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలోని కాంచిట్ చౌరస్తా వద్దనున్న పార్కుకు చెందిన స్థలాన్ని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ ,  బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు  కబ్జాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమని అన్నారు. పార్క్ కబ్జాకు గురైన ఇంతవరకు చర్యలు తీసుకుపోగా తన దృష్టికి రాలేదని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.  వెంటనే మున్సిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కబ్జాకు పాల్పడ్డ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మజర్ మాలిక్,  గయాజుద్దీన్,  రాశాద్,  అజ్మత్,  హర్షద్,  ప్రతాప్ , బబ్లు,  ఫయాజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.