కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
నవతెలంగాణ-చందానగర్
శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా అరికెపూడి గాంధీని మరోసారి గెలిపించాలని చందానగర్ కార్పొరేటర్ మం జులరఘునాథ్‌రెడ్డి కోరారు. మంగళవారం చందాన గర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ, శిల్ప ఎంక్లేవ్, గౌతమి నగర్, గంగారం హరిజన బస్తి, అన్నపూర్ణ ఎంక్లేవ్‌లో నియోజకవర్గం ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాధ్‌రెడ్డి, రవీందర్‌రావు, లక్ష్మి నారాయణగౌడ్, జనార్ధన్ రెడ్డి, వెంకటేశం, పులిపాటి నాగరాజు, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.