రేపటినుంచి టెన్త్‌, ఇంటర్‌ దూరవిద్య ప్రవేశాలు

– తుది గడువు 30
– ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టిన టాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. ఈ మేరకు టాస్‌ డైరెక్టర్‌ పివి శ్రీహరి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి, ఇంటర్‌లో ప్రత్యేక ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వాటిలో చేరేందుకు తుది గడువు ఈనెల 30 వరకు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ చేరేందుకు అవకాశముందని తెలిపారు. ఇతర వివరాల కోసం https://www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.