గాజాలో పిల్లలను చంపడం ఆపాలి : ట్రూడో

గాజా : గాజాలో చిన్న పిల్లలు, మహిళలపై జరుగుతున్న హత్యాకాండ వెంటనే ఆపాలంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చిన్నారుల మరణాలు, మహిళల కన్నీళ్లను టీవీల్లో, సోషల్‌ మీడియాలో ప్రపంచమంతా చూస్తున్నదని వ్యాఖ్యానించారు. వైద్యులు, బాధితులు మాట్లాడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్న విషయాన్ని ట్రూడో గుర్తుచేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. కన్న బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, చావు సమీపంలోకి వెళ్లి బతికి బయటపడ్డ బాధితుల అనుభవాలు హృదయవిదారకంగా ఉన్నాయని చెప్పారు. గాజాలో పిల్లల మరణాలను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందంటూ ట్రూడో పరోక్షంగా ఇజ్రాయెల్‌ పై వ్యాఖ్యలు చేశారు.