నవతెలంగాణ – రాయపర్తి: మండలంలోని పెర్కవేడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులైన వడ్డెర కులస్తులను పలువురిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల తాయిలాలతో మభ్యపెట్టి కండువా మార్చగా గురువారం గ్రామ ఎంపీటీసీ బండి అనూష రాజబాబు ఆధ్వర్యంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. అనంతరం బండి రాజబాబు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల తాయిలాలను ఎరచూపి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు చేసిన సహకారం ఎనలేనిది అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క ఇంటికి చేరింది అని వివరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలనలో ప్రతి ఒక్క పల్లె ప్రగతి పధంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి పాలకుడు కాదు ఒక ప్రజాసేవకుడు అని ప్రజలకు తెలుసు అని అభివర్ణించారు. ప్రజల అండదండలు బీఆర్ఎస్ పార్టీకి, ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎల్లవేళలా ఉంటాయి అన్నారు.