భారత్‌లో మరింత బలోపేతమైన సేవలు

– ఎయిర్‌ ఆసియా సీఈఓ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించామని ఎయిర్‌ ఆసియా ఏవియేషన్‌ లిమిటెడ్‌ గ్రూప్‌ సీఈఓ బో లింగం తెలిపారు. భారత్‌ తమకు ఎల్లప్పుడూ కీలకమైన మార్కెట్‌ అని పేర్కొన్నారు. తాము ఈ ఏడాది జనవరి – నవంబర్‌ మధ్య భారతదేశం నుండి 16,01,601 మందిని గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఇది తమ ఛార్జిలు, కనెక్టివిటీ ద్వారా సాధ్యమైందన్నారు. తాము భారతదేశంలో మా ఉనికిని మరింతగా బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తామన్నారు.. త్వరలో తిరువనంతపురానికి కొత్త మార్గాన్ని ప్రారంభించడంతో సహా మా విస్తరణ ప్రణాళికలను ప్రకటించడానికి సంతోషిస్తున్నామన్నారు.