హామీల అమలులో బీఆర్‌ఎస్‌ విఫలం

BRS has failed to implement the guarantees– సీపీఐ(ఎం) అభ్యర్థికే ఓటెయ్యాలి : కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-మంచాల, రంగారెడ్డి ప్రతినిధి
గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలవమైందని, నిత్యం ప్రజల కోసం పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల, చెన్నరెడ్డి గ్రామాల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు, నాగయ్యతో కలిసి ఇంబ్రహీంపట్నం అభ్యర్థి పగడాల యాదయ్య ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. కమ్యూనిస్టులతోనే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని తెలిపారు. సామాన్యుల కోసం పనిచేసే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. నాయకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, జి.నర్సింహ, కె.జగన్‌, రావుల జంగయ్య, ఎన్‌.శ్యామ్‌ సుందర్‌ పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు ఎర్రజెండా భరోసా : జయలక్ష్మి
మధ్యాహ్న భోజన కార్మికులకు ఎర్రజెండాతోనే భరోసా ఏర్పడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జయలక్ష్మి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్న భోజన కార్మికులను కలిసి సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పి.యాదయ్యకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వారి పక్షాన ఎర్రజెండా మాత్రమే ముందుండి ఉద్యమిస్తోందన్నారు. వారికి వేతనాలు చెల్లించాలని, ప్రతినెలా బిల్లులు విడుదల చేయాలని, అవిశ్రాంత పోరాటం చేశామన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళనల సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు, కార్మిక సంఘాల నేతలు లాఠీచార్జీలకు గురయ్యారన్నారు.