నీళ్లు అడుక్కునే కర్మ లేకుండా చేసాం

నవతెలంగాణ- మోర్తాడ్: రైతులు తమ పంట పొలాల్లోకి నీరు అందించడానికి నీతిని ఆడుకునే కర్మ లేకుండా 365 రోజులు నీటి సౌకర్యం కల్పించే విధంగా చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండలం పాలెం తిమ్మాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మాట్లాడారు. గత పాలనలో రైతులు లీకేజీ నీటిని అడుక్కునే దుస్థితి ఉండేదని, వరద కాలువ, కాకతీయ కాలువకు 365 రోజులు నీటి సౌకర్యాన్ని ఉంచుతూ పంట పొలాల్లోకి నిత్య నీటిని అందించే విధంగా నీటి సౌకర్యం కల్పించామని అన్నారు. లీకేజీ నీటి కోసం రైతులు ఉద్యమం చేసిన నీరు అందించలేని పాలకులు రైతులను మభ్యపెట్టే పయత్నం చేస్తున్నారని మాయమాటలు నమ్మి ప్రతిపక్షులకు ఓటు వేయొద్దని అన్నారు. కాలేశ్వరం నీటిని రివర్స్ పంపిణీ ద్వారా  వరద కాలువ ద్వారా ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ పంపిణీతిని తెచ్చిన ఘనత ఉందని అన్నారు. పడుతూ భూములు సైతం పంట భూములుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తాగండి కష్టాలను సైతం తెచ్చి ఇంటింటికి తాగునీరు అందించామని అన్నారు. పెదవగులు చెక్ డాములు నిర్మించి నీటి నిలువ ద్వారా భూగర్భ జలాలు పెంచే ప్రయత్నం చేశామని, 65 కోట్లతో తిమ్మాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో 24 గంటల కరెంటు సౌకర్యం కల్పించకుండా అప్పటికి తెలంగాణలో 24 గంటల కరెంటు ఉచిత పథకాలతో రైతులను మభ్యపెట్టుతూ మాయమాటలు చెబుతూ మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారని, పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ఇదే పథకం కర్ణాటకలో మహారాష్ట్రలో ఎందుకు అందివ్వడం లేదని ప్రశ్నించారు.