
– అభ్యర్థి వెంకట ముత్యం కి పూలతో ఘనస్వాగతం
నవతెలంగాణ – అశ్వారావుపేట: అశ్వారావుపేట నియోజకవర్గం బీసీవైపీ ఎమ్మెల్యే అభ్యర్థి, చిట్టితల్లి ఉచిత సేవా సమితి, ఉచిత అంబులెన్స్ వ్యవస్థాపకులు మనుగొండ వెంకట ముత్యం ప్రచారం ఉదృతం చేసారు. శుక్రవారం దమ్మపేట నుండి అశ్వారావుపేట వరకు వందలాది ద్విచక్ర వాహనాలు తో ప్రచారం నిర్వహించారు. మా పెద్దన్న,పేదలు బాధ తెలిసిన మా అన్న అంటూ మహిళలు పూలతో ఘనంగా స్వాగతాలు పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి వెంకట ముత్యం పలు సెంటర్లలో మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు చెరుకు రైతు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.గత ఎనిమిది సంవత్సరాలుగా ఉచిత అంబులెన్స్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా అత్యవసర వైద్య నిమిత్తం ఆస్పత్రి వద్దకు వారి అంబులెన్సు లు ద్వారా ఎంతోమందిని ఉచితంగా తీసుకువెళ్లి సహాయం చేస్తూ ఉన్న విషయమే. అందరికీ తెలిసిందేనని తన సేవలు మరింత రెట్టింపు చేస్తూ చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది యువకులు, సానుభూతిపరులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.