
నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్: కాంగ్రెస్ పార్టీ అధికారంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి బీర్లు ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని గ్రామ శాఖ ఆధ్వర్యంలో రామాజీపేటలో శుక్రవారం, కాంగ్రెస్ పార్టీలో చేరిన పాల సంఘం మాజీ చైర్మన్ కోలా మల్లేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుండే శ్రీశైలం ఇతర నాయకులు బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంక్షేమం అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి రామాజీపేట గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుండే సిద్ధులు, నాయకులు ఉపాధ్యక్షులు మొగిలిపక నరేష్, కృష్ణ స్వామి, గ్రామ ఉపసర్పంచ్ శేఖర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శంకర్, నమిల శ్రీశైలం, కల్లూరు భాస్కర్ రెడ్డి, కుండే ఆంజనేయులు, ఆరె మధు, కొమరయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.