జగన్ ఆధ్వర్యంలో 300 మంది చేరిక

– భూపతి రెడ్డికి దమ్ముంటే ముఖ్యమంత్రిని తిట్టమనండి
– అప్పిడవిట్ లో 45 కోట్లు వైట్ చూపించిన భూపతిరెడ్డి: బాజిరెడ్డి జగన్
నవతెలంగాణ- నిజాంబాద్:  మండల కేంద్రంలో జగన్ ఆధ్వర్యంలో 300 మంది యువకులు వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా  మండల కేంద్రం నుంచి అర్గుల్ గ్రామం వరకు జగన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి గెస్ట్ హౌస్ లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భూపతిరెడ్డికి దమ్ముంటే కేసీఆర్ ను తిట్టు మనండి అని ఆరోపించారు. ఆర్డిఓ ఆఫీస్ లో నిజాంబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి అఫీడవిట్లో 45 కోట్ల వైట్ చూపించాడని, ఇంకా బ్లాక్ ఎంత ఉందో అని ఆరోపించారు. భూపతి రెడ్డి ప్రచారంలో భాగంగా నేను ఆస్తులు అమ్ముకున్నానని భూపతిరెడ్డి అంటున్నాడని అతనిని నమ్మకూడదని అతను ఆస్తులు గత నాలుగు సంవత్సరాల కింద అమ్ముకొని హైదరాబాదులో ఆస్తులను కూడగట్టుకున్నాడని అతను అమ్ముకున్న ఆస్తుల నుంచి ఏ ఒక్కరికి కూడా సహాయం చేయలేదని, అసలు ఎప్పుడు ఎలక్షన్స్ రావాలని పార్టీ మారాలని మమ్ములను బాజిరెడ్డి గోవర్ధన్ ను ప్రచారంలో తిడుతున్నాడే గానీ అతనికి దమ్ముంటే కేసీఆర్ను తిట్టుమనండి అని ఆరోపించారు. అనంతరం పార్టీలో చేరిన యువకులందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమల రాజు, జడ్పిటిసి తనుజ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి మండల కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, జక్రం పెళ్లి ఎంపిటిసి రూపాల గంగారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.