ఎమ్మెల్యేగా గెలిపించండి  మానాల ను అభివృద్ధి చేస్తా

– బాల్కొండా కాంగ్రెస్ అభ్యర్థి  ముత్యాల సునీల్ కుమార్..
నవతెలంగాణ- రుద్రంగి: బాల్కొండ ఎమ్మెల్యే గా గెలిపిస్తే నియోజకవర్గంలో భాగమైన ఉమ్మడి మానాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. రుద్రంగి మండలంలోని ఉమ్మడి మానాలలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు మానాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ.. మానాల లో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్దే కనిపిస్తుందని కొత్తగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. పేద ప్రజల కోసం ఆసుపత్రి నిర్మించలేదని కమిషన్ల కోసమే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆసుపత్రి నిర్మించారని అన్నారు. ఆసుపత్రి నిర్మించి డాక్టర్లను నియమించడం మరిచారని అన్నారు. తండాలలో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందా. తండాలోలో ఉన్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింద. మానాల రైతులకు సాగు నీరు అందుతుంద అని ప్రజలు ఆలోచించి చేతి గుర్తుకు ఓటేయ్యాలని కోరారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుం జలపతి, నాయకులు జక్కు మోహన్,
మాజీ ఎంపీటీసీ రాజు నాయక్, గుగులోత్ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.