నవతెలంగాణ-చిట్యాలటౌన్
ఐకేపీ వీఓఏల 33 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం చిట్యాల కనకదుర్గ సెంటర్‌లో వంటావార్పు, బతుకమ్మ ఆట, రాత్రి బస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారా బోయిన శ్రీనివాస్ మాట్లాడారు. ఎండలు తీవ్రంగా ఉన్న 33 రోజుల నుంచి వెళ్లి సమ్మె చేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదని విమర్శించారు. వెంటనే సమస్యలను పరిష్కారం చేయకపోతే ఈ నెల 22వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేపడతామని, 29న చలో హైదరాబాద్ సర్ఫ్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం వేలాది మందితో చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఏదుళ్ళ లక్ష్మి,గుడిసె సువర్ణ, వడ్డగానే విజయ,ఏరుకొండ వెంకన్న,ఆద్దెల ఉమా, వలం దాసు కవిత, గుడిసె పద్మ,. బురుగు జ్యోతి, పాకాల సత్యనారాయణ,దేశపాక సత్తమ్మ, వనజా కుమారి తదితరులు పాల్గొన్నారు.