టీమిండియా గెలవాలని శ్రీ సరస్వతి విద్యార్థుల ప్రదర్శన                       

నవతెలంగాణ- భీంగల్: ఆదివారం అహ్మదాబాదులో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా జట్టు గెలవాలని కోరుతూ పట్టణ కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ విద్యార్థులు ఆల్ ది బెస్ట్ టీం ఇండియా  వరల్డ్ కప్  2023 అక్షరాల ప్రదర్శనను చేశారు. టీమిండియా జట్టు ప్రపంచ కప్ ను సాధించి కోట్లాదిమంది భారతీయ ప్రజల కలలను సాకారం చేయాలని కోరుకుంటున్నట్లు ప్రధానోపాధ్యాయుడు, ఏవో రవికుమార్, నర్సారెడ్డిలు తెలిపారు.