నవతెలంగాణ- డిచ్ పల్లి: ఇందల్ వాయి మండలంలోని ఆయా గ్రామాలలో నేలకోల్పనున్న మొక్కల నర్సరీ లను శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాములు నాయక్ అమ్సన్ పల్లి, ఎల్లారెడ్డి పల్లి, లోలం, మల్లాపూర్ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ లకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి లోటుపాట్లు లేకుండా నర్సరీని నెలకొల్పే విధంగా చూడాలని ఆదేశించారు. అయన వెంట టెక్నికల్ అసిస్టెంట్ మోతిరం, కార్యదర్శులు సువార్త, అనుష తోపాటు తదితరులు పాల్గొన్నారు.