నవతెలంగాణ- రామారెడ్డి : మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మా గౌడ్, అధికార పార్టీలో తట్టుకోలేకనే, కల్వకుంట్ల మదన్మోహన్రావు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు, శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కెసిఆర్ దీక్షలో అరెస్టు అయినప్పుడు, శ్రీకాంత్ చారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, చెల్లించి పోలీస్ స్టేషన్లో గుండు గీయించుకున్నామని, రైలు కేసులు అయ్యాయని, అయినా భయపడకుండా ఉద్యమాన్ని ఉధృతం చేశామని, నేడు పార్టీలో ఆ పరిస్థితి లేదని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వడ్ల లక్ష్మణ్, సొసైటీ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, తదితరులు పాల్గొన్నారు.