కాంగ్రెసులో చేరిన చోల్లేడు ఎంపీటీసీ..

నవతెలంగాణ- మునుగోడు:  మునుగోడు మండలంలోని చోల్లేడు ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి  కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారాయణ రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం కావడంతో శనివారం మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని భావించి  మునుగోడు నియోజకవర్గం లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు గర్వంగా ఉందని అన్నారు . మునుగోడు ప్రజల, ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవం కోసం ధర్మ యుద్ధానికి వెళ్లానని ఆ ధర్మ యుద్ధంలో తమను గెలిపించేందుకు మునుగోడు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మండల వైస్ ఎంపీపీ అనంత వీణ లింగస్వామి , మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి, ఉప సర్పంచ్ గోదాల శంకర్ రెడ్డి, చిలుముల నరసింహ, మాజీ సర్పంచ్ ముప్ప రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ సత్తయ్య గ్రామ శాఖ అధ్యక్షులు బుడిగపాక రవి, వార్డు సభ్యులు కేశపోయిన మల్లేష, చిలుముల రుద్రయ్య, బేరి కృష్ణయ్య, సీనియర్ నాయకులు వంగూరి కుమార్, వంగూరి మారయ్య, పాల సంఘం చైర్మన్ జనిగల ముత్యాలు, భైరుకొండ యాదయ్య, జనగాం స్వామి, బాలెం మల్లమ్మ, వంగూరి నరేష్,మరియు తదితరులు పాల్గొన్నారు.