క్రికెట్ ప్రపంచ కప్పు ఫైనల్ మ్యాచు. మొదటి వికెట్ తొందరగా పడింది. బ్యాట్స్‌మన్ అదే బల్లేబాజ్…. క్రీజు వదిలి పెవిలియనుకు పోకుండా అలాగే ఉన్నాడు.
అంపైర్ అతని దగ్గరకొచ్చి ”నీవు అవుటయ్యావు కదా ఇంకా ఇక్కడ నీకేం పని” అన్నాడు.
”నేను రోజూ పద్నాలుగు గంటలు పనిచేయాలంట సారూ, ఇప్పుడిప్పుడే పోను” అనేశాడు. చట్టసభల్లో ఐతే మార్షల్సు ఉంటారు ఎత్తుకొని పోవడానికి ఇక్కడ ఏమిచేయాలబ్బా అని అంపైర్ తలపట్టుకున్నాడు.
”ఒరే సురేష్, ఎనిమిది గంటల్లో యాభై కేజీల అన్నం వం డితే, పద్నాలగు గంటల్లో ఎన్ని కేజీలు వండవచ్చు? చెప్పు చూద్దాం” లెక్కల సారు ప్రశ్న.
సురేష్ లెక్కలు వేస్తున్నాడు మనసులో.
ఇంతలో గాయత్రి లేచి ”యాభై కేజీల గంజి తయారవు తుంది సార్” అనేసింది. క్లాసు రూమంతా చప్పట్లు
”ఏమండీ శ్రీమతి గారూ, నాష్టా అయ్యిందా? ఎనిమిది కొట్టేటప్పటికి కడుపులో ఎలుకలు పరిగెడతాయి” భర్త అడిగాడు
”ఆ అవుతోంది.. అవుతోంది ఇంకో గంట” భార్య
”ఎందుకండీ రోజూ ఎనిమిదికే కద పెట్టేది” ఖాళీ ప్లేటు రెడీగా పెట్టుకొని అడిగాడు
”అది రోజుకు ఎనిమిది గంటల డ్యూటీ ఉన్నోళ్ళకు, దాన్ని పద్నాలగు గంటలు చేస్తే టిఫిను తొమ్మిది గంటలకి వస్తుంది”
”దానికీ, దీనికి సంబంధమేముంది” భర్త అమాయక డైలాగు
”అదేమో మీ బాసునే అడగండి, ఓ నాలుగు గంటలు లేటు గా పంపుతాడుగా ఈరోజునుండీ? మా వాళ్లు ఇంట్లో కూడా అదే రూలు పెట్టినా రని చెప్పండి” భార్య నికార్సుగా చెప్పింది
”ఈసారి నా పేరూ అందరికీ తెలియాలయ్యా, ఆ నారా యణమూర్తి పేరుకంటే నా పేరు మారుమోగిపోవాలి” బాసు నర్సింగ్ అన్నాడు
”దానికి ఏం చేద్దామని సార్ మీ ప్లాను” యాద్‌గిరి తన తెలి విని ఉపయోగించి అడిగాడు. అయితే తన తెలివిని అమాయ కత్వమని బాసు అనుకుంటాడని ఎక్కడో లోపల అనుమానం యాద్‌గిరికి
”రోజుకెన్ని గంటలు పనిచేయాలని కదా టాపిక్కు, ఆయనేమో వారానికి డెబ్భై గంటలన్నాడు, దాన్ని మించి నేను ఏదో ఒకటి మాట్లాడాలని కోరిక”
”ఇదంతా సమయాన్ని వృధా చేయడమే కద సార్”
”ఇదేదో బాగుంది, సమయాన్ని వధా చేయడమెలా అని ఇంకొకటి చెబుతాను తరువాత, ఇప్పుడు విను అసలు స్పీచు, రోజుకు అందరూ డెబ్భై గంటలు పనిచేయాలి ఎలాగుంది ఆయన వారమంటే నేను రోజు అన్నాను, కొద్దిగా మార్చానంతే”
”ఏమీ అనుకోనంటే ఒకటి చెబుతాను సార్”
”చెప్పవయ్యా, నీవు నా శ్రేయోభిలాషివి” నర్సింగ్
”రోజుకు ఇరవైనాలగు గంటల కద సార్ ఉండేది” యాద్‌గిరి
”అవునయ్యో… ఆ విషయమే మరిచి పోయానే? అయినా రోజుకు ఇరవైనాలుగ్గంటలు అని నిర్ణయించడానికి ఎవరికీ ఎలాంటి హక్కూ లేదు. నిముషానికి అరవై సెకండ్లు ఉండాలని, గంటకు అరవై నిముషాలుండాలని ఎవరు డిసైడ్ చేశారు? తీస్తాను మన పాత గ్రంధాలు తీస్తాను. తీసి మనం ఫలానా మార్పులు చేయాలని కొత్తగా కాలాన్ని నిర్వచిస్తాను. నిముషానికి ఇరవై సెకండ్లో ఇంకా వీలైతే పదహైదు సెకండ్లో పెడతాను. రోజులో తొంభై గంటలు వచ్చే విధం గా కాలాన్ని దాని కొలతల్ని మారుస్తాను. ఇప్పుడు చెప్పు రోజుకు డెబ్భై గంటలు పని చేయలేమా?”
” వీరబ్రహ్మం గారి కాల జ్ఞానం గురించి విన్నాం కాని కాలం పై ఇంత జ్ఞానం ఉండడం నిజంగా విశేషం సార్”
” అప్పుడే ఏమైంది బ్రో, ఇది ఇంకా మొదలు మాత్రమే! చూస్తూ ఉండు ఒక్కో సీను క్లైమాక్సులా ఉండేలా మండే సూర్యుడు నెల్సన్ మండేలాలా రెచ్చిపోతా”
”మధ్యలో మండేలా అస్సలు అతకలేదు సార్”
”ఆ మాటకొస్తే ఏదీ అతక దయ్యా, మనమే అతికించాలి. ఒకే మాట పదులు, ఇరవైల సార్లు చెబితే జనాలకు అదే అలవాటై పోతుంది. మన నాయకుల్ని చూడడం లేదూ?”
”ఏమో సార్! తరువాత చెప్పలేదంటనకపోయ్యేరూ అని ముందే చెబుతున్నాను, నాకైతే ఇది నచ్చడం లేదు”
”మొదట్లో ఎవ్వరికీ ఏదీ నచ్చదయ్యా, మనమే నచ్చేలా చేయాలి. ఒక్కోదాన్నీ పట్టు కుని సాగదీయాలి, అదే మన టెక్నిక్కు”
”ఈరోజు నాకు జ్ఞానోదయమ య్యింది సార్, ఇక ఇక్కడినుండి తప్పుకోవాలని” యాద్‌గిరి
అలా ఆ బాసూ, అసిస్టెంట్ల సంభాషణ సా.. గిపోతూనే ఉంటుంది, కొన సా…గిపోతూనే ఉంటుంది. ఊరంతా ఒకదారి… ఉలిపిరి కట్ట ఇంకోదారి అన్న సూత్రం వదిలేసి కుటుంబంలో పెద్దోళ్ళు ఏదైతే చెబుతుంటారో దాన్నే కొత్తగా వారానికి డెబ్భై గంటల పనిలా చెబుతూ ఉంటే సరి. మీడియా లో మన పేరు కనిపిస్తూనే ఉంటుంది. వినిపిస్తూనే ఉంటుంది.
ఒప్పుకున్నోళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోనివారు ఎప్పటికీ ఒప్పుకోరు అన్న డైలాగులు వదులుతూ ఉంటే సరి. ఐతే ఇక్కడొ చ్చిన బాధంతా ఒకటే. ఎందరో యువత తమ మారదర్శులుగా తీసుకున్న ఈ మేధావులు, ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లు, శాస్త్రజ్ఞులు ఉన్న ట్టుండి ఇలాంటి దెబ్భై గంటల పని అంటూ మాట్లాడితేనే కొద్దిగా కోపమొస్తుంది. వాళ్ళకన్నీ తెలుసు అని మనం అనుకొంటాము కాని కొన్ని విషయాల్ని పట్టించుకోకుండా ఠకీమని మాటలనే స్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏయే దేశాల్లో ఎన్నిగంటలు పని చేస్తున్నారు, ఎవరి ఎంతగా అభివృద్ధి చెందారు మొదలైన సమా చారం సరిగ్గా చూడకుండా, చూసినా దాని గురించి చెప్పకుండా మాట్లాడితేనే కోపమొచ్చేది. డిగ్రీలు లేకున్నా అంతకంటే తెలివి ఉన్నోళ్ళు వెంటనే సరైన విషయాలు సేకరించి మరీ చెబుతారనీ వీళ్ళకి తెలుసు. ఐనా ఎంతో కొంత డ్యామే జీ జరిగిపోతే చాలు అని వీళ్ళు అనుకుంటారేమో, తాము చెప్పేది ఆపరు. ఏయే దేశాల్లో ఎన్ని గంటలు పనిచేస్తారు, వాళ్ళ జాతీయా దాయం, ఉత్పత్తి ఎంత అని గణాంకాలు రెడీగా దొరుకుతాయి గూగుల్లో. మొదట అవి తెలుసుకొండని సలహా.
రోజుకు ఎనిమిది గంటల పని, పనికి సరిపోయిన జీతం అన్నది ఎంత పెద్ద భావననో, సూత్రమో ఈ సో కాల్డ్ మేధావు లకు అర్థం కాదు. రోజుకు ఎనిమిది గంటలు పనిచేసేటోళ్ళకి రేపటినుండి నువ్వు పన్నెండు గంటలు పనిచేయాలి అని హుకుం జారీ చేస్తే పాలల్లో, మజ్జిగలో నీళ్ళు కలిపినట్లు తయార వుతుంది పరిస్థితి. క్షీణోపాంత అని లేదా తగ్గుతున్న క్రమాన్ని తెలిపే ఉత్పత్తి, వినియోగ విలువల గురించి కొన్ని సిద్ధాంతాలు న్నాయి ఆర్ధిక శాస్త్రంలో. అవేవీ తెలియనట్టు, చదవనట్టు నటి స్తూ కొందరు చేసే సూచనలు చూస్తే నవ్వొస్తుంది. పదో పన్నెండో గంటలో పనిచేసే అమాత్యులు ఏకంగా పద్నాలుగు, పదహారు గంటలు పనిచేస్తే ఇప్పుడు అమ్మేస్తున్న ప్రజల ఆస్తు లు, ప్రభుత్వ సంస్థలు ఇంకెన్ని అమ్ముడుపోతాయో? ప్రజల మధ్య తగాదాలు పెట్టే వారివల్ల ఇంకెన్ని గొడవలు మొదలవు తాయో? అమ్మో ఈ పెంచిన పని గంటల సూత్రం వల్ల మంచి జరిగేదెవరికి అన్న అనుమానం సామాన్యులకు రావడం సహజం.
– జంధ్యాల రఘుబాబు
9849753298