
మండల పరిధిలోని మాచారం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ సీతరామచంద్ర ఆలయ నిర్మాణానికి అనిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిరెడ్డి వెంకటరెడ్డి రూ.లక్ష నలభై వేలు విరాళంగా గతంలో అందజేయగా, ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని దీక్ష బూనిన స్వాముల భిక్ష ఏర్పాటు నిమిత్తము మరో రూ.10వేలు విరాళంగా ఆలయ నిర్మాణకర్త బొల్లక బోబ్బయ్యకు అందచేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఆలయానికి గ్రామస్థులు అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందుల రమేష్, చిత్రం శ్రీనివాస్, చిత్రం శోభన్, బొల్లక దేవయ్య, వీరబోయిన సోమన్న, పేరం మధు, బొల్లక సౌడయ్య, బొల్లక సోమయ్య, దీక్షబూనిన స్వాములు, ఆలయ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.