అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి : చిరుమర్తి

నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఈ నెల 30న జరిగే ఎన్నికలలో తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కోరారు. మంగళవారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 14, 15, 16 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పనులు పూర్తి చేయిస్తానన్నారు. నకిరేకల్ ప్రశాంతంగా ఉండాలంటే అరాచక వాదులను దూరం పెట్టాలని కోరారు. నకిరేకల్ లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ డాక్టర్ నలగాటి ప్రసన్న రాజ్, మునిసిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎల్లపు రెడ్డి సైదా రెడ్డి, కౌన్సిలర్ ఘర్షకోటి సైదులు, నాయకులు ఎస్కే అమీర్ పాషా, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.