రాజగోపాల్ రెడ్డి గెలుపు ఈసారి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది…

 – కూసుకుంట్లను ఓడించడమే మా లక్ష్యం…
– 6 గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం..
–  కాంగ్రెస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి..
నవతెలంగాణ- మునుగోడు: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే గొంతులను నొక్కే విధంగా కెసిఆర్ పదేళ్లుగా నియంత పాలన తీరుగా మునుగోడు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయకపోవడంతో నమ్ముకున్న మునుగోడు ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించి మునుగోడు నియోజకవర్గం అనగానే గుర్తింపు పొందే విధంగా ప్రభుత్వంపై యుద్ధం చేసిన మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఈసారి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని కాంగ్రెస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చల్మెడ గ్రామంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లపై గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లోని అధికారులను కూసుకుంట్ల గుప్పిట్లో పెట్టుకొని ప్రతి సమస్యలో  తలదూర్చి అరాచకంగా  వ్యవహరించిన కూసుకుంట్లకు చరమగీతం పాడేందుకు తొమ్మిది రోజులే ఉన్నదని అన్నారు. మునుగోడు నియోజకవర్గం లో  సొంత పార్టీ నాయకులను రాజకీయంగా దెబ్బతీసే విధంగా వ్యవహరించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని ఓడించడమే మా ఏకైక లక్ష్యం అని అన్నారు.  కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పగిళ్ల శ్రీరాములు, కొంక శంకర్, బాతరాజు సత్తయ్య , ఉప్పర బోయిన నరసింహ, గాదపాక ప్రభాకర్, కొంక చంద్రయ్య తదితరులు ఉన్నారు.