అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లోకి వలసలు

 – రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి
నవతెలంగాణ – నాంపల్లి:
అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్, బీజేపీ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో  చేరుతున్నారని నాంపల్లి రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని టీపీగౌరరం గ్రామపంచాయతీ  6వ వార్డు సభ్యురాలు భూతం అంజమ్మ సురేష్ ,4వ వార్డు సభ్యులు జడిగం అశ్విని మహేష్ , 5వ వార్డు ధార లక్ష్మమ్మ సుధాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమ్ము ఈదయ్య,  తుంగపాడు నుండి ఆకనమోని శివ నలుగురు పార్టీలో చేరారు. వారికి నాంపల్లి రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో 50 ఏళ్లుగా తీరని సమస్యలను తీర్చుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండదండగా ఉన్న మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి అండగా ఉండేందుకు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రజలందరూ ఇది గమనించి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీ అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుమ్మడుపు నర్సింహా రావు, టీపీగౌరారం మాజీ ఎంపీటీసీ,  మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడారి శ్రీశైలం యాదవ్, పోచంరెడ్డి వెంకట్ రెడ్డి, బేగరి కిరణ్,  వట్టికోటి నరేష్, చిలుకూరి దశరథ,కొమ్ము సైదులు, ఆంజనేయులు, దేవేందర్, మహేష్, కోటేష్, నరేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.