కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారు

– ఓటమి భయంతో కేసీఆర్ ఓపిక లేని మాటలు
– ప్రశ్నిస్తే దొరల అహంకారం బయటకు వస్తుంది
– పైళ్ల శేఖర్ రెడ్డి మంచినీళ్లు తాగారా ఇంకేమైనా తాగారా? 
– పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడవద్దు
– తెలంగాణలో  బిఆర్ఎస్ లో గద్దె దించుడు ఖాయం
– కాంగ్రెస్ 75 సీట్లు గెలుస్తుంది
– కుంభం అనిల్ కుమార్ రెడ్డి
– మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు
నవతెలంగాణ-భువనగిరి : భువనగిరి నియోజకవర్గం లో కాంగ్రెస్ ప్రచారం సందర్భంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ బ్రహ్మరథం పడుతున్నారని గ్రామ గ్రామాన కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.  మంగళవారం భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ వలిగొండ ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే యూత్ కాంగ్రెస్ ప్రజల తరఫున నిరసన తెలుపుతూ ఓటమి భయంతో ఓపిక లేని మాటలు దూషణలు చేస్తూ మాట్లాడారని విమర్శించారు. ఇది తెలంగాణ సంస్కృతి కాదని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలను చెత్త నా కొడుకులు అంటూ విమర్శలు చేయడం ఎంతవరకు సభ అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుతూ సన్యాసులు, వీపులు పడగొడతానడం భావ్యం కాదన్నారు. ప్రశ్నిస్తే దొరల అహంకారం బయటకు వస్తుందన్నారు. నిరుద్యోగులు, యువకులు, యువజనులు పెద్ద ఎత్తున టిఆర్ఎస్  నిరసన తెలుపుతున్నారని తెలిపారు. ఆలేరు ప్రాంతానికి చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అసెంబ్లీలో నోరు విప్పలేదు అన్నారు. బునాది గాని కాలువ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంలో విఫలమైనారని తెలిపారు. త్రిబుల్ ఆర్ గురించి తెలవదు అనడం ఎమ్మెల్యే అజ్ఞానానికి నిదర్శనం అన్నారు.  తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి కొమ్మిడి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి మోత్కుపల్లి నరసింహులు లాంటి ఎందరో యోధాను యోధులు ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా కొనసాగారని తెలిపారు. వారి భాషను తెలుసుకొని మాట్లాడాలని కోరారు. టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ప్రతిపక్షాలను ప్రస్తావిస్తూ ఒరేయ్, అరే అంటూ  ఊగిసలాడుతూ మాట్లాడారని తెలిపారు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడాడని భాష సక్కదిద్దుకోవాలని కోరారు. అతను మంచినీళ్లు తాగారా లేక ఇంకేమైనా తాగారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బిఆర్ఎస్ను గద్దెదించడం ఖాయమని 75 సీట్లు గెలుస్తామన్నారు. కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  తమ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్ ను 25 లక్షల ఇస్తానని ఆశ చూపి పార్టీలో చేర్చుకోవడానికి పైల శేఖర్ రెడ్డి డబ్బు రాజకీయం చేశాడని ఆరోపించారు నియోజకవర్గంలోని పోచంపల్లి బీబీనగర్ భువనగిరి వలిగొండలలో బిఆర్ఎస్ పార్టీ అయిందని తెలిపారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ  గెలుస్తుందని తెలిపారు
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ
తెలంగాణ సెంటిమెంటు పోయింది. బీఆర్ఎస్ పీఠం కదులుతుంది
నిశ్శబ్ద విప్లవం రాక మానదు
కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మోత్కుపల్లి నరసింహులు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఏమి చేసిందని ప్రశ్నిస్తున్నాడని తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు రెండుసార్లు తెలంగాణ సెంటిమెంట్తో నాటకమాడి ప్రజలను మోసం చేసి గెలిచారన్నారు. ఆ సెంటిమెంట్ ఇప్పుడు పోయిందని నీ పీఠం కదలక మానదని కేసీఆర్ను హెచ్చరించారు. కెసిఆర్ 10 ఏళ్ల పాలన చూసి ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రానున్నదని అందులో బిఆర్ఎస్ కొట్టుకపోతుందన్నారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలే ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. రానున్న కాలంలో రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వడం కోర్టుకు వెళ్లడం నిరుద్యోగులను ముంచడం బిఆర్ఎస్కే సాధ్యమన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సంఘటనలో కెసిఆర్ పాత్ర కూడా ఉందన్నారు. అది అక్రమ అరెస్టులు అన్నారు. హైదరాబాద్  సెటిలర్లు కేసీఆర్ కు ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు. అందులో భాగంగానే టిడిపి తెలంగాణలో పోటీ చేయడం లేదన్నారు. కేసీఆర్ ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు పంపాడని తెలిపారు. బి ఆర్ ఎస్ ఇచ్చిన డబ్బులు తీసుకొని తినండి తాగండి ఓటు మాత్రం కాంగ్రెస్కే వేయాలని మోత్కుపల్లి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు బూడిద పోసి కట్టారని ఎద్దేవ చేశారు. దళితులకు అన్యాయం చేశాడని పేర్కొన్నారు. నిరుద్యోగులు గ్రూప్ వన్  పరీక్షల వాయిదాలతో అయోమయంలో పడిపోయారని తెలిపారు.  విద్యార్థి ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు నైతికత ఉంటే కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, పిసిసి కార్యదర్శి ప్రమోద్ కుమార్, పిసిసి సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, డిసిసి అధ్యక్షులు అన్నేం సంజీవరెడ్డి, నాయకులు బీస్కుంట సత్యనారాయణ ఎషాల అశోక్, వలిగొండ ఎంపీపీ వెంకటేశం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే డబ్బులతో కొనుగోలు చేయాలని చూశారు
మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్
నవతెలంగాణ-భువనగిరి
స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తనను డబ్బులతో కొనుగోలు చేయాలని చూశాడని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్ విమర్శించారు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తనకు ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మద్దతు కోసం పంపించాడని తెలిపారు. మరో 25 లక్షలు ఇస్తానని తెలిపారని వివరించారు. డబ్బులతో తనను కొనుగోలు ఎవరు చేయలేరని తెలిపారు. నియోజకవర్గంలో అతని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డబ్బులను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి డిపాజిట్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .